సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకం ఖరారు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది. న్యాయ వ్యవస్థలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి కొలీజియం సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.