కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు కన్నీళ్లే మిగిలాయంటూ బీఆర్ఎస్ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు అనేలా దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పంప్‌హౌస్‌లను ఆన్ చేసి నీళ్లను తరలిస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కృష్ణా నదిలో నీరు ఉన్నప్పటికీ మోటార్లు ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువని తీవ్రంగా విమర్శించింది.