సినిమా కెరీర్ పై మానుషి చిల్లర్ సంచలన వ్యాఖ్యలు: సొంత నిర్ణయాలే మేలని స్పష్టీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: ముంబై

సినిమా పరిశ్రమలో సొంత నిర్ణయాలు తీసుకోవడమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని ప్రముఖ నటి మానుషి చిల్లర్ వెల్లడించారు. బాలీవుడ్ లో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేనప్పుడు మనకోసం రోల్స్ రాసేవారు ఉండరని, లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. విక్రాంత్ మస్సెతో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'స్నాప్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు.