కోడుమూరులో ఆశా వర్కర్ల నిరసన: కనీస వేతనం చెల్లించాలని ఎంపీకి వినతి

రిపోర్టర్: సునీల్ స్థలం: కర్నూలు

తమకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ కోడుమూరులో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు జీపీ వీరన్న ఆధ్వర్యంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లను రెగ్యులర్ చేయాలని, అన్ని రకాల సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.