పెద్దపల్లి వయోవృద్ధుల ఆశ్రమంలో ఘనంగా యోగా డే నిర్వహణ

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ పాల్గొని వయోవృద్ధులతో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజూ యోగా సాధన ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. వయోవృద్ధుల అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన 14567 టోల్ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.