'ప్రతిరోజూ 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం': మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: రమేష్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం మరియు హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.8 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ కిచెన్ ద్వారా 17 మండలాల్లోని సుమారు 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందనుందని, విద్యార్థుల ఏకాగ్రత, సామర్థ్యం పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు.