బట్టేలంకలో భారీ వాహనం బీభత్సం: గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మలికిపురం

మలికిపురం మండలం బట్టేలంక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఓఎన్జీసీకి చెందిన భారీ వాహనం ఇరుకైన రహదారిపై చిక్కుకుపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 60 అడుగుల పొడవున్న సదరు వాహనం రహదారికి అడ్డంగా నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక అధికారులు తక్షణమే స్పందించి ముందస్తు భద్రతా అనుమతులు పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బట్టేలంక గ్రామీణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.