ఖైరతాబాద్ ఉపఎన్నికలో ఊహించని మలుపు: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
ఖైరతాబాద్ ఉపఎన్నికను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు విజయా రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవర్గాలు వెల్లడించాయి. తన అనర్హత పిటిషన్‌కు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ఎన్నికల పిటిషన్ తేలకుండా ఉపఎన్నిక ఎలా నిర్వహిస్తారని వారు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.