ఉద్యోగుల తొలగింపుతో ఒరాకిల్ సంస్థలో కలకలం
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత ప్రారంభమైంది. అమెరికాలో పలువురు ఉద్యోగులకు సెప్టెంబర్ 14న తెల్లవారుజామున టెర్మినేషన్ మెయిల్స్ అందాయి. ఉదయం 6 గంటలకే ఒరాకిల్ లీడర్షిప్ నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. మెయిల్ రాకముందే కొందరి కంపెనీ లాగిన్లు, స్లాక్ యాక్సెస్ నిలిపివేశారు. కంపెనీ కొనసాగిస్తున్న రీస్ట్రక్చరింగ్, ఖర్చుల తగ్గింపు ప్రక్రియలో భాగంగానే ఈ కోతలు చేపట్టారు. ఏఐ, క్లౌడ్ వ్యాపారంపై దృష్టి పెడుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.