విద్యుదాఘాతంతో తొమ్మిది నెలల చిన్నారి మృతితో విషాదం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నమునగాల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇల్లందుల రమేశ్, మమతల దంపతుల తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్తు ఎర్త్‌వైర్‌ను పట్టుకున్నాడు. తీవ్ర విద్యుదాఘాతంతో అపస్మారకస్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. నిరుపేద కుటుంబంలో జరిగిన ఈ అకస్మిక ప్రాణనష్టంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.