జగ్గయ్యపేటలో మార్గదర్శి 135వ నూతన శాఖ ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మార్గదర్శి చిట్ఫండ్ 135వ నూతన శాఖను ఎండీ శైలజా కిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. ఖాతాదారులుగా చేరిన వారందరూ ఉన్నత స్థితికి చేరాలన్నదే తమ సంస్థ లక్ష్యమని ఆమె తెలిపారు. 64 ఏళ్లుగా మార్గదర్శి సాధించిన స్థిరత్వం, విశ్వాసమే తమ విజయానికి కారణమని ఎండీ శైలజా కిరణ్ పేర్కొన్నారు.