ట్రోలింగ్ మరియు రాజకీయ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ముంబై
బిగ్ బాస్ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆన్‌లైన్ ట్రోలింగ్, పెయిడ్ ట్రోల్స్ మరియు సెలబ్రిటీలపై రాజకీయ అంశాల గురించి మాట్లాడాల్సిన ఒత్తిడిపై తీవ్రంగా స్పందించారు. పరిశ్రమలోని కొందరు వ్యక్తులు, నిర్మాతలు డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి అంశంపై తాము స్పందించాల్సిన అవసరం లేదని, జర్నలిస్టులు టీఆర్పీ కోసం తమను వివాదాల్లోకి లాగవద్దని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.