విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామంటూ మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

ప్రకృతి అందాలు మరియు టెక్నాలజీ హంగులతో విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గంగవరం బీచ్ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేస్తూ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. కొండలు సముద్రాన్ని తాకే అద్భుతమైన తీర ప్రాంతంతో పాటు వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక రంగంతో విశాఖ తూర్పు తీర శాన్ఫ్రాన్సిస్కోగా మారుతుందని మంత్రి వెల్లడించారు.