దేశాన్ని విభజించే కుట్రలను తిప్పికొట్టాలి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

రిపోర్టర్: రమేష్ స్థలం: ఢిల్లీ

దేశాన్ని విభజించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి శత్రువులను ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఘనమైన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా వేడుకలు దేశాన్ని మరింత ఏకం చేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.