బ్యాంకు వినియోగదారులకు కీలక అలర్ట్: నవంబర్లో వరుసగా పండుగ సెలవులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజ మరియు గురునానక్ జయంతి వంటి వరుస పండుగల కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. అయితే బ్యాంక్ బ్రాంచ్లు మూసి ఉన్నప్పటికీ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల డిజిటల్ సేవలు ఎప్పట్లాగే యథావిధిగా కొనసాగుతాయని వారు తెలిపారు.