పలాసలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ భారీగా సొత్తు స్వాధీనం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పర్లాకిమిడి యువకులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 తులాల బంగారం, కేజీన్నర వెండి, నాలుగు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ముఠాపై పాతపట్నం, మెలియాపుట్టి, వజ్రపుకొత్తూరు పరిధిలో అనేక కేసులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.