కాళీఘాట్ ఆలయ లాకర్ తాళం చెవి మాయంపై తీవ్ర కలకలం
రిపోర్టర్: సతీష్
స్థలం: పశ్చిమ బెంగాల్
కోల్కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయంలో 1980 నుంచి లాకర్ తాళం చెవి కనిపించడం లేదని, ఆలయ ఆస్తులు కరిగిపోతున్నాయని నిర్మాతల వారసుడు దేబర్షి రాయ్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ఆలయ నిధులు, బంగారు ఆభరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం, జిల్లా కోర్టు జడ్జికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.