ఎన్నికల ప్రధాన కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
రిపోర్టర్: సతీష్
స్థలం: కర్ణాటక
ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, పనితీరుపై వివాదాల నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సగ్ర సవరణ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి కొత్తగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. కమిషన్‌లోని ముగ్గురు సభ్యులలో ఇద్దరు అసమ్మతి తెలపడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు.