షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక: థియేటర్లలోకి డీడీఎల్జీ సినిమా రీ-రిలీజ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధమవుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. షారుఖ్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో పరిమిత స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.