ఫామ్హౌస్లో యువకుడి మృతి: పుట్టినరోజు వేడుకల్లో కలకలం రేపిన ఘటన

రిపోర్టర్: సురేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఇరవై ఒక్క ఏళ్ల కృష్ణ కౌండిన్య ఏదులాబాద్లోని ఓ ఫామ్హౌస్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. రిటైర్డ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కుమారుడైన కృష్ణ కౌండిన్య అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. కుమారుడి మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.