'దేశం కోసం పనిచేసిన మాజీ సైనికుడిపై దాడా?': జగన్‌పై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

మాజీ సైనికుడు, స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీకి ఎంపికైన చక్రపాణి రెడ్డిపై సాక్షి ప్రతినిధులు దాడి చేయడం అత్యంత దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పనిచేసిన మాజీ సైనికుడికి జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా అని నేతలు నిలదీశారు.