గ్లోబల్ చెస్ లీగ్‌లో అభిమన్యు మిశ్రాకు నాటకీయ ఓటమి
రిపోర్టర్: విజయ్
స్థలం: కర్ణాటక
గ్లోబల్ చెస్ లీగ్‌లో గంగెస్ గ్రాండ్‌మాస్టర్స్‌పై అలస్కాన్ నైట్స్ తలపడింది. ప్రొడజీ బోర్డుపై అభిమన్యు మిశ్రా గెలిచే స్థితిలో నిబంధనల ఉల్లంఘన కారణంగా నాటకీయంగా ఓడిపోయాడు. క్వీన్‌గా ప్రమోట్ చేసే సమయంలో రూక్ కిందపడటంతో అంపైర్లు అసంపూర్ణమైన మూవ్‌గా ప్రకటించారు. దీంతో కేవలం ఒక సెకను మిగలడంతో సమయం ముగిసి ఓటమిపాలయ్యానని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు.