అత్యంత పొడవైన టైటిల్‌తో రానున్న చంద్రసిద్ధార్థ సినిమా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో అత్యంత పొడవైన టైటిల్‌తో తెరకెక్కిన మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి...’ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. హర్ష, అమైరా గోస్వామి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం, మానవ మెదడు మధ్య సంబంధాన్ని చర్చించే ఈ విభిన్న కథాచిత్రంపై భారీ అంచనాలున్నాయి.