నెల్లూరు కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుండగా, 352 టేబుల్స్ ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1,591 మంది పోలీసులను నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు.