ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటి బిపాసా బసు

రిపోర్టర్: రాము స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న పీరియడికల్ క్రైమ్ థ్రిల్లర్ 'బారాబంకి' చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నారు. 1984లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీ కౌశల్, విశాల్ జేత్వా కూడా నటిస్తున్నారు.