ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు: స్వల్ప ఉద్రిక్తతల నడుమ అరవై శాతం పోలింగ్
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు నగరపాలక సంస్థలు, డెబ్బై తొమ్మిది పురపాలక సంఘాలకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు అరవై శాతానికి పైగా నమోదైందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్ లో బ్యాలట్ పత్రాలు తారుమారు కావడంతో స్వల్ప గందరగోళం నెలకొన్నప్పటికీ, వెంటనే స్పందించి సరిదిద్దినట్లు అధికారులు స్పష్టం చేశారు.