'స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయం': వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: SPSR Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్వేపల్లి పరిశీలకులు వీరి చలపతితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.