సినిమా అప్డేట్: కాకినాడలో బాలకృష్ణ దాదా సినిమా షూటింగ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కాకినాడ
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం నుంచి కాకినాడలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో బాలకృష్ణ, మంచు మనోజ్‌లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు అలాగే భారీ క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం.