లారీ యజమానులను వేధించిన రవాణా అధికారి ఏసీబీకి చిక్కింది
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో రవాణా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి గోపీనాయక్ అక్రమ వసూళ్లు, వేధింపులు తట్టుకోలేక లారీ యజమానులే స్వయంగా ఏసీబీ అధికారులకు పట్టించారు. రాత్రివేళల్లో లారీలను ఆపి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఈ అధికారి అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సర్వీస్ కాలం ఇంకా ఉండగానే రెండుసార్లు సస్పెండ్ కావడం గమనార్హం.