డిట్రాయిట్ లయన్స్ జట్టుకు భారీ షాక్: గాయపడిన జాక్ క్యాంప్ బెల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Detroit

డిట్రాయిట్ లయన్స్ జట్టుకు చెందిన స్టార్ ఆటగాడు జాక్ క్యాంప్ బెల్ మెడకు తీవ్ర గాయమైనట్లు హెడ్ కోచ్ డాన్ క్యాంప్ బెల్ తెలిపారు. మినోసటా వైకింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో జట్టులో తలెత్తిన లోటును పూడ్చేందుకు కొత్త ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు కోచ్ స్పష్టం చేశారు.