కొమ్మిక పంచాయతీలో దూకుడుగా జనసేన అభ్యర్థి ఇంటింటి ఎన్నికల ప్రచారం
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కూడా దేవుడు ఉధృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు, జనసేన వీర మహిళ సప్పాగెడ్డ పద్మ సునీల్‌తో కలిసి ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలకు పార్టీ విధానాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేతల అప్పారావు, భీమరాజు, దేవత, రమేష్ సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థికి పరిపూర్ణ మద్దతు పలికారు.