గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ తండాల అభివృద్ధిని కీర్తించిన నేతలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని రామ్ నుంతల గ్రామపంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి సర్పంచ్ వి శ్రీను నాయక్ తో కలిసి ఆయన పాలభిషేకం చేశారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లపై కాలయాపన చేస్తుందని ఆరోపించారు.