వరకట్న వేధింపులతో జాతీయ రెజ్లర్ అశ్విని, ఇద్దరు పిల్లల ఆత్మహత్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర ధారాశివ్‌లో జాతీయ స్థాయి రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో అశ్విని, ఆమె కుమారుడు అజింక్యా, కుమార్తె క్రాంతి మృతి చెందారు. అత్తింటి వారి వరకట్న వేధింపులే తన కూతురి చావుకు కారణమని తండ్రి ఆరోపించగా, భర్తతో పాటు అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.