సాధారణ బైక్‌తో ఉమ్లింగ్ లా పాస్ అధిరోహించిన బిహార్ యువకుడు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: లడఖ్
బిహార్‌కు చెందిన 24 ఏళ్ల రమేశ్ కుమార్ సాధారణ 110సీసీ బైక్‌పై, ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లా పాస్‌ను విజయవంతంగా చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. 22 రోజుల పాటు 6,000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ సాహసయాత్రలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కేవలం మనోబలంతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.