గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణ సుప్రీంకోర్టుకు బదిలీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణను సుప్రీంకోర్టు తన చేతుల్లోకి తీసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణపై స్టే విధించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పారదర్శక విచారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన ధర్మాసనం, సెప్టెంబర్ 30 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.