అస్సాంలో మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ హత్య కేసులో ఇద్దరు నిందితులపై పోలీసు కాల్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: అస్సాం
అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లాలో మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ బిమన్ బరువా హత్య కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి వేర్వేరు ఘటనల్లో పోలీసుల కాల్పులతో గాయపడ్డారు. ప్రధాన నిందితుడు విక్కీ సింగ్ తో పాటు మరో నిందితుడు మొహమ్మద్ రుబుల్ ఖాన్ విచారణ సమయంలో పోలీసులపై దాడికి యత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు ఎస్పీ పాపోరి చేటియా వెల్లడించారు. ఈ ఘటనలపై ప్రత్యేక కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.