హైదరాబాద్లో జీరో కమిషన్ విధానంతో ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

హైదరాబాద్ నగరంలో ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రముఖ రైడ్ హేలింగ్ సంస్థ రాపిడో అడుగుపెట్టింది. ఓన్లీ పేరుతో కొత్త సేవలను ప్రారంభించినట్లు సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకా తెలిపారు. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా జీరో కమిషన్ విధానాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. కస్టమర్లు ఆహార ధరతో పాటు డెలివరీ ఛార్జీ మాత్రమే చెల్లించే పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ లాంచ్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో నాని పాల్గొని రాపిడో కెప్టెన్లతో ముచ్చటించారు.