పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

వివిధ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స చేయించుకుని పేదలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం CMRF పథకాన్ని అమలుచేస్తోందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 240 మందికి ఆయన సిఫారసుతో మంజూరైన రూ.74లక్షల విలువైన CMRF చెక్కులను ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి చెక్కులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు.