మధ్యప్రదేశ్ లో కాలువలోకి దూసుకెళ్లిన కారు ఎనిమిది మంది మృతి

రిపోర్టర్: రాము స్థలం: Madhya Pradesh

మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమదం జరిగింది. ఒడిశా నుంచి బగులాముఖి ఆలయానికి వెళ్తున్న భక్తుల కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రి సమయం కావడంతో పాటు వర్షం కారణంగా కాలువ సరిగ్గా కనిపించక ఈ ప్రమాదం జరిగింది. కారు డోర్లు లాక్ అయిపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేక నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.