చిన్నగెడ్డ మోడల్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా కిముడు విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చిన్నగెడ్డ మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధానోపాధ్యాయుడు జి. కామేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్గా పట్టభద్రుడు కిముడు విజయ్, వైస్ చైర్మన్గా ఎస్. రత్నాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్యా ప్రమాణాల మెరుగుదల మరియు మౌలిక వసతుల కల్పనకు నూతన కమిటీ కృషి చేయాలని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.