ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్ లో జీఓ 59, 76 అమలుపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక బృందాల ఏర్పాటును వెల్లడించారు. అర్హతలు, గడువులకు అనుగుణంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సంబంధిత అధికారులను స్పష్టంగా ఆదేశించారు.