అన్నదాతలకు తీపి కబురు: వరంగల్ మార్కెట్లో రికార్డు స్థాయిలో మక్కల ధరలు

రిపోర్టర్: హరి స్థలం: వరంగల్

వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మక్కలకు భారీ డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ మక్కల ధర రికార్డు స్థాయిలో 3255 రూపాయలు పలికిందని వారు పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంతో దిగుబడి తగ్గిపోయినప్పటికీ, ప్రస్తుత గిట్టుబాటు ధర తమకు ఎంతో ఊరటనిస్తోందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.