పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై పనకబండలో బీఆర్ఎస్ జోరుగా అవగాహన

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోత్కూరు మండలంలోని పనకబండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఫారం పద్దెనిమిది స్లిప్పులను పంపిణీ చేస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల ఆరో తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.