రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: మూడు రోజుల పాటు దాడుల నిలిపివేత

రిపోర్టర్: హరి స్థలం: World

నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా రాయబారుల పర్యటన నేపథ్యంలో, పుతిన్ ఆదేశాలతో రష్యా మూడు రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది. దీనికి జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. ట్రంప్ చొరవతో జరుగుతున్న ఈ చర్చలు సఫలమైతే, ప్రపంచాన్ని పీడిస్తున్న యుద్ధానికి శాశ్వత ముగింపు లభించి, ఆర్థిక సంక్షోభాల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.