కల్వకుర్తిలో ఘనంగా లయన్స్ క్లబ్ రక్తదాన శిబిరం

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదానంపై అవగాహనతో పాటు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన ప్రతి విద్యార్థికి లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ ఛైర్మన్ బావండ్ల వెంకటేశ్, కో-చైర్మన్ బండెల రాంచంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసా సర్టిఫికెట్లను అందజేసి వారి సేవలను అభినందించారు.