కుక్కునూరులో విప్లవ యోధురాలు సీతక్కకు ఘన నివాళి
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విప్లవ పోరాట యోధురాలు కామ్రేడ్ గంగసాని సరోజిని (సీతక్క) సంతాప సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో, సీతక్క చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నేత కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ, సీతక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.