టొరంటో చిత్రోత్సవంలో చారిత్రాత్మక ఘనత సాధించిన మలయాళ సినిమా

రిపోర్టర్: కిరణ్ స్థలం: టొరంటో

దర్శకుడు సంజాద్ పిఎస్ తెరకెక్కించిన మలయాళ చిత్రం హాఫ్ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలో ప్రదర్శించబడి ఘనమైన మైలురాయిని సాధించింది. ఈ విభాగంలో చోటు దక్కించుకున్న తొలి మలయాళ చిత్రంగా నిలిచిన ఈ సినిమాకు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రదర్శన అనంతరం చిత్ర బృందం ప్రేక్షకులతో ముఖాముఖి నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.