విద్యార్థులకు తీపి కబురు: వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: Pilani

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన తొలి వెయ్యి మందికి నూటికి నూరు శాతం ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ అందించనున్నట్లు వి. రామ్గోపాల్రావు తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం ఇరవై లక్షల లోపు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని వివరించారు. దీనిద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులకు ఉన్నత చదువుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.