దిల్లీలో ఘోర ప్రమాదం: భవనం కూలి ఇద్దరు మృతి, పలువురు గల్లంతు

రిపోర్టర్: సురేష్ స్థలం: దిల్లీ

దిల్లీలోని చావ్డీ బజార్ లో గురువారం ఉదయం మూడు అస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. దీపావళి రద్దీ సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషదాన్ని నింపింది.