జేమ్స్ బాండ్ కొత్త సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన రచయిత

రిపోర్టర్: విజయ్ స్థలం: World

రాబోయే జేమ్స్ బాండ్ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు ప్రముఖ స్క్రీన్ రైటర్ స్టీవెన్ నైట్ వెల్లడించారు. ప్రధాన పాత్రధారి ఎవరనే విషయం స్పష్టత ఉండటంతో స్క్రిప్ట్ రాయడం చాలా సులభమైందని తెలిపారు. కొత్త 007 నటుడి ఎంపిక దాదాపు ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.